బాబోయ్‌ కుక్కలు | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ కుక్కలు

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

మెట్‌పల్లి: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో రాత్రిపూట వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. స్థానికంగా కుక్కల బెడద ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రమే నిదర్శనం. రోజు రోజుకూ వీటి సంఖ్య పెరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టడం లేద నే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టెరిలైజేషన్‌ కొన్నిరోజులు చేపట్టి తర్వాత నిలిపివేసినట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రివేళల్లో వీధుల్లో తిరుగుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రతి నెలా పదుల సంఖ్యలో ప్రజలు వీటి బారిన పడి గాయాల పాలవుతున్నారు. అయినా అధికారులు వాటి నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement