పోషకాహారం ప్రాముఖ్యతను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

పోషకాహారం ప్రాముఖ్యతను గుర్తించాలి

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

● సంక్షేమాధికారి ఎ.భాస్కర్‌

మల్యాల: పోషకాహారంతో వ్యాధుల నియంత్రణ సాధ్యమని జిల్లా సంక్షేమాధికారి ఎ.భాస్కర్‌ తెలిపారు. పోషణమాసంలో భాగంగా మండలంలోని ముత్యంపేట పంచాయతీలో మన అంగన్వాడీ, మనందరి బాధ్యత అంశంపై అవగాహ కల్పించారు. పోషకాహారంపై క్విజ్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. పిల్లలకు సకాలంలో వ్యాక్సినేషన్‌ చేయించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీడీపీఓ వీరలక్ష్మీ, సర్పంచ్‌ దారం ఆదిరెడ్డి, ఉప సర్పంచ్‌ ముత్యం రెడ్డి, పోషణ్‌ అభియాన్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ మధు, సూపర్‌వైజర్‌ శారద, అంగన్వాడీ టీచర్లు శోభ, శారద, గంగ, మమత, పద్మ పాల్గొన్నారు.

విరిగిన చెట్టు.. ధ్వంసమైన కార్లు

జగిత్యాలరూరల్‌: బుధవారం రాత్రి భారీ ఈదురుగాలులు, కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లిలో చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. రాయికల్‌ మండలం కొత్తపేట నాగాలయ ఈవో విక్రం, మరో వ్యక్తి తమ కార్లను చెట్ల కింద పార్క్‌ చేశారు. చెట్టు విరిగిపడటంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.

ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలందించాలి

● డీఎంహెచ్‌వో సుజాత

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. సారంగాపూర్‌ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఓపీ, జ్వర పీడితుల సంఖ్య, ల్యాబ్‌ టెస్ట్‌ల రికార్డులను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షించారు. రోగులకు సరైన వైద్యసేవలు అందించడంతోపాటు, అన్ని రకాల టెస్ట్‌లు చేయాలన్నారు. మండల వైద్యాధికారి రాధారెడ్డి, హెచ్‌ఎస్‌ కిశోర్‌, తారా, హెప్సీ ఝాన్సీ, ఫార్మసిస్ట్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు అల్లీపూర్‌ విద్యార్థి

రాయికల్‌: మండలంలోని అల్లీపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పోతుగంటి జశ్వంత్‌ లాంగ్‌జంప్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ కృష్ణప్రసాద్‌ గురువారం తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొననున్నారు. సర్పంచ్‌ ఎంబారి గౌతమి, వెంకటేశ్‌, హెచ్‌ఎం కిరణ్‌ జశ్వంత్‌ను అభినందించారు.

వేలంలో గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

జగిత్యాల: నవరాత్రులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న గణపతి చేతిలోని లడ్డూను మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం యువకుడు వేలంలో దక్కించుకున్నాడు. పట్టణంలోని గోవిందుపల్లి టీం 7 యూత్‌ ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూకు వేలం వేయగా.. జగిత్యాలకు చెందిన గాయకుడు ఎండీ.అబి కుమారుడు మహ్మద్‌ ఇసాన్‌ రూ.70వేలకు పాడి దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement