ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడింది. పశుగ్రాసం కొరత తీవ్రమైంది. దాణా రేట్లు విపరీతంగా పెరిగాయి. పాల రేట్లు మాత్రం పెరగడంలేదు. పాడి రైతులకు తీవ్రనష్టాలు వస్తున్నాయి. పాడి పరిశ్రమ ఇబ్బందికరంగా మారింది.
– గూడ లింగారెడ్డి, పాడి రైతు, పొరండ్ల
పాల దిగుబడిపై దృష్టి సారించాలి
పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు రైతులు సైలేజ్, అజోల్లా, హైడ్రోపోనిక్స్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాలి. రైతులు పశుగ్రాసంతో పాటు, దాణ ద్వారా పాల దిగుబడి పెంచేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
– నరేశ్‌రెడ్డి, పశువైద్యాధికారి, మోరపల్లి


