‘ఇందిరమ్మ’కు పేదరికమే కొలమానం | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు పేదరికమే కొలమానం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

గొల్లపల్లి/ధర్మపురి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గొల్లపల్లి మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాల్లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలు అందించారు. పేదల ఇంటి నిర్మాణం చేసుకోవాలనే తపన ఉన్నా.. ప్రభుత్వం నుంచి సహకారం లేక వారి ఆశ నిరాశగా ఉండేదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 2500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని, మరో రెండు వేల ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురిలోని ఒకటో వార్డులో బత్తిని రజిత, రమేశ్‌, నాయిని అనూష, శ్రీనివాస్‌ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌ దినేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, నాయకులు వేముల రాజు తదితరులున్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 15 దరఖాస్తులు

జగిత్యాలక్రైం: పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 15 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

ఇంటర్‌లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలి

రాయికల్‌: ఇంటర్‌లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి రమేశ్‌బాబు సూచించారు. రాయికల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సోమవారం తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో పలు సబ్జెక్ట్‌లపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదు ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ప్రత్యేక పునశ్ఛరణ నిర్వహించి ఇంటర్‌లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నిర్మల పాల్గొన్నారు.

దక్షిణాసియా త్రోబాల్‌ పోటీలకు భూపతిపూర్‌ యువకుడు

రాయికల్‌: మండలంలోని భూపతిపూర్‌ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రవీశ్‌రెడ్డి శ్రీలంకలోని రత్నపురలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించే దక్షిణాసియా పారా త్రోబాల్‌ పోటీలకు ఎంపికై ంది. భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రీడలకు ఎంపికై న రవీశ్‌రెడ్డిని గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు అభినందించారు.

కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి

జగిత్యాల: కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలుగా అడువాల జ్యోతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకేంద్రానికి చెందిన జ్యోతి కొద్దిరోజులు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు నందయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement