సంబరాలు కాదు.. బిల్లు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

సంబరాలు కాదు.. బిల్లు ఇవ్వండి

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

జగిత్యాలరూరల్‌: ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు చేయడం కాదని, ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు ఇచ్చి ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం లక్ష్మీదేవిపల్లి, రేచపల్లి, బట్టపల్లి గ్రామాల్లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు ఇంటి నిర్మాణం పూర్తయినా బిల్లులు రావడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పు చేసి ఇంటి నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారని, దీపావళి సంబరాలు చేసుకుని కొత్త ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రభుత్వం చెబుతుంటే అప్పు చేసుకున్న లబ్ధిదారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement