రోడ్డు పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పునరుద్ధరించండి

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

మాది పెగడపల్లి గ్రామం పదో వార్డు. సొంత ఇంటికి వెళ్లే దా రిని కొందరు మూశారు. సర్పంచ్‌, పంచాయితీ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా తొలగించారు. ఇటీవల అదే రోడ్డును మళ్లీ మూసివేశారు. అడిగితే దాడి చేసి గాయపరిచారు. పెగడపల్లి పోలీసులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. మా ఇంటికి రాకపోకలు సాగించేలా రోడ్డును పునరుద్ధరించండి.

– కోకిల మణెవ్వ, పెగడపల్లి

జీవనోపాధి దూరం చేస్తున్నారు

నూకపల్లి అర్బన్‌ కాలనీలో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో టేలా పెట్టుకుని జీవిస్తున్నాను. కొందరు మున్సిపల్‌ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి నేను లేని సమయంలో టేలా తొలగించారు. తిరిగి ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఇబ్బంది పెడుతున్నారు.

– రామగిరి హరిత, నూకపల్లి అర్బన్‌కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement