జగిత్యాల:బాల్య వివాహరహితం, పోక్సో కేసులు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యమని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. పిల్లల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధన, పోక్సోకేసుల నివారణపై గురువారం అవగాహన కల్పించారు. మిషన్ వాత్సల్య కింద బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి మండలం, గ్రామాల్లో నెలవారీగా అమలు చేయాలని సూచించారు. జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్, డీఎంహెచ్‌వో సుజాత, సీడీపీవోలు వీరలక్ష్మీ, జయప్రధ, వాణిశ్రీ, పద్మ, డీసీపీవో సురేశ్, పీవో కరుణశ్రీ, విద్యా శాఖ కో–ఆర్డినేటర్లు మహేశ్, సఖి విభాగం, భరోసా కేంద్రం అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రాజాగౌడ్


