గిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 42.534 టీఎంసీలకు చేరింది. ఎగువప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 12,604 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 993 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నేటి నుంచి ఎంబీబీఎస్ పార్ట్–1 పరీక్షలు
జగిత్యాల: ఎంబీబీఎస్ ఫైనల్ పార్ట్–1 పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మెడికల్ విద్యార్థులకు సంబంధించి అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 11న కమ్యూనిటీ మెడిసిన్ పేపర్–1, 13న కమ్యూనిటీ మెడిసిన్ పేపర్–2, 18న ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్స్‌కాలజీ పరీక్షలు జరుగనున్నాయి.
బాబుపై భక్తితో తెలంగాణ హక్కుల తాకట్టు
జగిత్యాలటౌన్: ఎల్‌నినో ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిణామాలపై ఆరునెలలుగా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా, ఎలాంటి మానవ ప్రయత్నాలు చేయకుండా కేవలం వరుణయాగానికి పరిమితమవడం విస్మయం కలిగిస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మిడిహెట్టి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి 30 నెలలుగా నిద్రపోయి ఇప్పుడు పక్క రాష్ట్రంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన ప్రాజెక్టుల అనుమతులను పునఃపరిశీలించే అవకాశం లేకపోయినా చంద్రబాబు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద అభ్యంతరం తెలిపారని అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి పాటిల్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి ఇప్పటికే అనుమతులు పొందిన తెలంగాణ ప్రాజెక్టుల పునఃపరిశీలన చేస్తే జరిగే అన్యాయంపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఇది బాబు, రేవంత్ గురుశిష్యుల బందానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఓటుకు నోటు అమలు చేసిన రేవంత్, మరోసారి తెలంగాణ ప్రజల హక్కులను బాబుకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అల్పపీడన ప్రభావం రైతుల్లో ఆశలు నింపినా భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మడిహెట్టి నిర్మాణం చేపట్టాలని కోరారు. వరుణయాగంతో వర్షాలు కురవాలని కోరుకుంటున్నానని, కేవలం యాగాలపై ఆధారపడితే ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. వరుణయాగంతోనైనా రేవంత్, ఉత్తంకుమార్‌రెడ్డికి జ్ఞానోదయం కలగాలన్నారు. అయిల్నేని వెంకటేశ్వర్‌రావు, మున్నా, కల్లెపెల్లి దుర్గయ్య, తోట హరీశ్, చందా రాధాకిషన్, సాయికుమార్, నేహాల్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు.


