కొడిమ్యాల(చొప్పదండి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మండలకేంద్రానికి చెందిన ఔదరి లక్ష్మికి మొదటి విడత ఇల్లు మంజూరై సాంకేతిక కారణాలతో ఆలస్యం అయిన నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని సోమవారం ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ అందించారు. మొదటి విడతలో మండలంలో 450 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని రెండో విడతలో మరిన్ని మంజూరు చేస్తామన్నారు. రానున్న మూడేళ్లలో గుడిసె లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నామని వివరించారు. సర్పంచ్ గడ్డం జీవన్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగురి భూషణ్‌రెడ్డి, ఎఎంసీ వైస్ చైర్మన్ కొండూరి రాజేశ్, నేరెళ్ల మహేశ్, పర్లపల్లి ప్రసాద్, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, రాపర్తి నర్సింగరావు, గుర్రం ప్రవీణ్, ముత్యం శంకర్, గోల్కొండ రాజు, చింటు, కవ్వం మధు, సోమ వెంకీ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


