పంచాయతీలకు ఎగనామం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ఎగనామం

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

● ఏళ్ల తరబడి చెల్లింపుల్లేని సెల్‌టవర్ల పన్ను ● ఆదాయం కోల్పోతున్న గ్రామ పంచాయతీలు

అనుమతికి రూ.10 వేల రుసుము

పెగడపల్లి: కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటూ పంచాయతీలకు ఏడాదికోసారి చెల్లించాల్సిన పన్నులను సెల్‌టవర్ల యాజమనులు ఎగ్గొడుతున్నారు. పంచాయతీల నుంచి నోటీసులు జారీ చేస్తున్న వారు ఖాతరు చేయడం లేదని కార్యదర్శులు చెబుతున్నారు. దీంతో మండలంలోని పంచాయతీలు ఏటా రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఆదాయం కోల్పోతున్నాయి.

దాదాపు 40 టవర్లు

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఐడి యా, జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఏయిర్‌ టెల్‌ తదితర కంపెనీలకు చెందిన సుమారు 40 వరకు సెల్‌ టవర్లు ఉన్నాయి. ఎప్పుడు ఇంటి పన్ను వసూళ్లకు ప్రజల వెంటపడే పంచాయతీ సిబ్బంది, అధికారులు సెల్‌టవర్లకు సంబంధించిన పన్నుల వసూలు కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా కంపెనీలు ఒక్క టవర్‌కే ఒప్పందాలు చేసుకుని తర్వాత ఇతర కంపెనీలకు చెందిన టవర్ల పరికరాలు అమర్చుకొని కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. టవర్‌ ఏర్పాటు చేసే స్థలంలో టవర్‌తో పాటు జనరేటర్‌, గది నిర్మాణం అంతా కలిసి సుమారు 300 గజాల నుంచి 400 గజాల స్థలంలో చుట్టూ హహరీతో ఉన్నా యి. ఎంత చిన్న పంచాయతీ అయినా ఏడాదికి కనీసం రూ.2 వేలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

నోటీసులు జారీ చేస్తాం

పన్ను చెల్లించాలని మండల కేంద్రంలో ఉన్న సెల్‌టవర్ల యజమానులకు పంచాయతీ నుంచి నోటీసులు జారీ చేస్తాం. ఏళ్ల తరబడి వాటి నుంచి పన్ను రావాల్సి ఉంది. బకాయిలు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

– ఒరుగల అరుణ, సర్పంచ్‌, పెగడపల్లి

సెల్‌టవర్‌ నిర్మాణానికి ముందుగా సంబంధించిన పత్రాలతో పాటు పంచాయతీకి అనుమతి కోసం ద రాఖాస్తు చేసుకోవాలి. పంచాయతీకి రూ.10 వేలు రుసుం చెల్లించాలి. డబ్బులు చెల్లించగానే రసీదు ఇచ్చి అక్కడున్న విస్తీర్ణాన్ని బట్టి ఏడాదికి ఎంత ప న్ను అనేది అప్పుడే గుర్తించాల్సి ఉంటుంది. తర్వా త ప్రతీ ఏడాదికి టవర్ల నుంచి పన్ను కట్టించుకోవా లి. కానీ ఇక్కడ అలా జరగడంలేదు. టవర్‌ అద్దెకు ఇచ్చేవారు పంచాయతీ సిబ్బందితో ఒప్పందం కు దుర్చుకుని అనుమతి పొందుతున్నారు. దీంతో పంచాయతీకీ రావాల్సి న ఆదాయం కోల్పోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement