జగిత్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను వీడాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద వామపక్షపార్టీల ఆధ్వర్యంలో జైల్ భరో నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయకూలీలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశాలు, మధ్యాహ్నభోజన వర్కర్లు హాజరై నిరసన తెలిపారు. నిరసన కారులను పోలీసులు స్టేషన్‌కు తరలించి ఆందోళన విరమింపజేశారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని, వివిధ స్కీంలలో పనిచేస్తున్న వర్కర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, చింత భూమేశ్వర్, ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, భూతం సారంగపాణి, నాయిని శారద, జంగిలి ఎల్లయ్య, మల్యాల సురేశ్, వెల్ములపల్లి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.


