దక్షిణ భారత సైన్స్‌ డ్రామా పోటీలు | - | Sakshi
Sakshi News home page

దక్షిణ భారత సైన్స్‌ డ్రామా పోటీలు

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

● 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవకాశం

జగిత్యాల: విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియం, విశ్వేశ్వర ఇండస్ట్రీయల్‌ అండ్‌ టెక్నాలజికల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో దక్షిణ భారత సైన్స్‌ డ్రామా పోటీలు– 2026 నిర్వహించనున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పోటీలు జరుగనున్నాయి.

ఈ అంశాలపై..

కృత్రిమ మేథస్సు, స్నేహితుడు, సాధనం, ప్రమాదం, ఈవీ, భవిష్యత్‌ దిశ, అంతరక్షిత నివాసాలు, సముద్రాల పునరుద్ధరణ, భావితరాల పర్యవేక్షణ అనే ఇతివృత్తాలపై నాటకాలు ప్రదర్శించాలి. ఈనెల 20 నుంచి సెప్టెంబర్‌ 2లోపు జిల్లాస్థాయి, సెప్టెంబర్‌ 25 నుంచి 26వ తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి, నవంబర్‌ 19 నుంచి 20వ తేదీల్లో బెంగుళూరులో దక్షిణ భారతస్థాయి, 2027 జనవరిలో జాతీయస్థాయి పోటీలు కోల్‌కతాలో నిర్వహించనున్నారు. నాటికలో శాసీ్త్రయ అంశం, ప్రదర్శన, ప్రభావం, సమాజ హితం, అంశాల వారిగా మొత్తం 100 మార్కులు కేటాయిస్తారు. నాటిక 30 నిమిషాల నిడివి మించవద్దు. బృందంలో 6–10 మంది విద్యార్థులు పాల్గొనవచ్చు. సంగీతం, వేషధారణ, మైమ్‌, నృత్యం వంటి వాటితో ఏ భాషలోనైనా ప్రదర్శన ఇవ్వొచ్చు. ఒకే నాటికను జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రదర్శించాలి. మిగతా వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి మచ్చ రాజశేఖర్‌ను 94402 12333 నంబర్‌లో సంప్రదించవచ్చు.

హెచ్‌ఎంలు చొరవ చూపాలి

ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. ఇది మంచి అవకాశం. అన్ని పాఠశాలల యజమాన్యాలకు వివరాలు పంపిస్తాం. ఆసస్తి గల వారు వివరాలు నింపి ఆగస్టు 20లోపు పంపించాలి.

– రాము, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement