ప్రత్యేక నిధులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక నిధులు ఇవ్వాలి

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విద్యుత్‌ బిల్లుల కోసం నిధులు కేటాయించాలి. కేంద్రం నిధుల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించాలనడం సరికాదు. చిన్న పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులే ఆధారం. వచ్చిన నిధులను విద్యుత్‌ దీపాల కొనుగోలు, ట్రాక్టర్‌ మరమ్మతు, పారిశుధ్యం, తాగునీటికి వెచ్చిస్తున్నాం. – అమిరిశెట్టి లక్ష్మీనారాయణ,

సర్పంచ్‌, రాములపల్లి

బిల్లులు చెల్లించాలి

గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లులను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాల్సిందే. దీనిపై జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశాం. నూతన పాలకవర్గాలు ఏర్పడిన నాటి నుంచే చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు పంచాయతీలు నిధులను సమకూర్చుకోవాలి.

– మదన్‌మోహన్‌, డీపీవో

విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలి

గ్రామ పంచాయతీలకు ఉన్న విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలి. ఆదాయ వనరులు సరిగా లేని చిన్న పంచాయతీలు ఈ భారీ బిల్లులను భరించలేక సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి విద్యుత్‌ బిల్లుల సమస్యను పరిష్కరించాలి. లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. – ఉప్పులంచె భవాని, సర్పంచ్‌, ఆరవెల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement