Telangana Crime News: తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..
Sakshi News home page

తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..

Aug 28 2023 12:36 AM | Updated on Aug 28 2023 12:52 PM

- - Sakshi

జగిత్యాల: డెంగీతో చిన్నారి మృతిచెందిన ఘటన ఆదివారం రాయికల్‌ మండలం రామాజిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోనే గౌతమి–రాజరెడ్డి కూతురు గోనే మోక్ష(5)కు వారం రోజులుగా తీవ్రస్థాయిలో జ్వరం రాగా జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్థారించారు. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని తెలపడంతో కరీంనగర్‌ తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. రాజరెడ్డి ఇటీవలే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లాడు. చిన్నారి మృతితో తండ్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement