మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు.. | Woman among two people killed, 9 injured in Manipur militant attack | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..

Sep 2 2024 4:34 AM | Updated on Sep 2 2024 4:34 AM

Woman among two people killed, 9 injured in Manipur militant attack

ఇద్దరు మృత్యువాత

ఇంఫాల్‌: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్‌బాండ్‌ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్‌ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement