పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి | suicide bomber rams military convoy in northwest Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి

Jun 28 2025 6:32 PM | Updated on Jun 28 2025 6:54 PM

suicide bomber rams military convoy in northwest Pakistan

కరాచీ:  పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికుల మృతిచెందారు. పాకిస్తాన్‌ సైనికులే లక్ష్యంగా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళంలోని సభ్యుడు.. ఆర్మీ వాహనంపైకి దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది పాక్‌ సైనికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.  ఈ ఘటనలో 19 మంది స్థానికులు, మరో 10 మంది ఆర్మీలోని సైనికులు గాయాలపాలయ్యారు.

మిలటరీ కాన్వాయ్‌ వెళుతున్న సమయంలో సూసైడ్‌ బాంబర్‌ ఒక్కసారిగా ఆ కాన్వాయ్‌పై దూకాడు. ఆపై వెంటనే తన వెంట తెచ్చుకున్న బాంబును పేల్చేసుకున్నట్లు పాక్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో దగ్గర్లో ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు.  అయితే  ఇది ఎవరు చేశారు అనే దానిపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రిక్‌-ఈ-తాలిబన్‌ గ్రూప్‌ అనేది తరుచుగా పాక్‌లోని సైనికులే లక్ష్యంగా దాడులు చేయడంతో ఇది కూడా వారే చేసే ఉంటారని అనుమానిస్తున్నారు.  ఇది బలూచిస్తాన్‌  ప్రాంతంలో జరగ్గా,  ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లోని పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. 

ఈ ఏడాది మార్చిలో జాన్‌డోలా చెక్‌పోస్ట్‌ పరిధిలో సూసైడ్‌ బాంబింగ్‌ జరిగింది.  ఇక్కడ కూడా పాకిస్తాన్‌ ఆర్మీ క్యాంపే లక్ష్యంగా దాడి జరిగింది. బలోచ్‌ మిలిటెంట్లు జఫ్ఫార్‌ ఎక్స్‌ప్రెస్‌ను అటాక్‌ చేసిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అసువులు బాశారు.  ఇక గ్లోబెల్‌ టెర్రర్‌ ఇండెక్స్‌ లో పాకిస్తాన్‌లోనే అత్యధికంగా ఉంది. పాక్‌లో ఉగ్రవాదం అనేది 45 శాతంగా నమోదు కాగా, అంతకంతకు పెరుగుతూ ఉంది. మరణాల పరంగా చూస్తే 2023లో ఉగ్రవాద చర్యలతో 748 ప్రాణాలు కోల్పోగా, 2024 నాటికి అది 1, 081గా పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement