పక్షపాతం, రాజకీయ కుట్ర : షేక్‌హసీనా
ఢాకా: తనకు మరణ శిక్ష విధిస్తూ ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా(Sheikh Hasina) స్పందించారు. ఈ తీర్పు పక్షపాతంతో కూడినదనీ, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని వ్యాఖ్యానించారు. అలాగే తనపై వచ్చిన అన్ని ఆరోపణలను హసీనా తోసిపుచ్చారు. ఎన్నికే కాని తాత్కాలిక ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన న్యాయవాదులు గైర్హాజరులో తన తరపున వాదించడానికి కూడా తనకు న్యాయమైన అవకాశం ఇవ్వ లేదన్నారు. పేరుకే ఐసీటీ తప్ప అందులో అంతర్జాతీయం ఏమీలేదని విమర్శించారు. ఎపుడూ న్యాయం జరగ లేదని ఆరోపించారు. అటు తాత్కాలిక ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తుల హత్యకాండల ఉద్దేశానికి, భయానక ధోరణికి హసీనా మరణశిక్షే నిదర్శనమని అవామీ లీగ్ పార్టీ పేర్కొంది.



