మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి... | Sapla AKhtar Bangladesh India Love Story | Sakshi
Sakshi News home page

అప్పుడు పాకిస్తాన్ నుంచి.. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి..  మరో ప్రేమకథ.. 

Jul 14 2023 9:30 PM | Updated on Jul 14 2023 9:49 PM

Sapla AKhtar Bangladesh India Love Story - Sakshi

కోల్కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు  ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. 

రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్‌లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. 

ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. 

యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా..  ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement