తరుముకొస్తున్న మరో మహమ్మారి?.. శాస్త్రవేత్తల హెచ్చరిక | Next Pandemic Soon bat Viruses in China Show Covid Like Threat | Sakshi
Sakshi News home page

తరుముకొస్తున్న మరో మహమ్మారి?.. శాస్త్రవేత్తల హెచ్చరిక

Jun 6 2025 8:15 PM | Updated on Jun 6 2025 9:27 PM

Next Pandemic Soon bat Viruses in China Show Covid Like Threat

కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. దీని బారినపడి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ కోవిడ్‌-19 ప్రపంచ దేశాలను పూర్తిగా వీడనే లేదు. అయితే ఇంతలోనే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ముంచెత్తనున్న మరో ముప్పుపై హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ‘నేచర్ కమ్యూనికేషన్స్‌’లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, కాల్టెక్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా బృందాలు తమ పరిశోధనలో మెర్బెకోవైరస్‌లలోని ఉప వేరియంట్‌ అయిన హెచ్‌కేయూ5 వైరస్‌లపై దృష్టి సారించారు. ఇవి 2019లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-​కోవ్‌తో సంబంధం కలిగినవి. ఇవి సుమారు 34 శాతం మరణాల రేటును కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

హెచ్‌కేయూ5 వైరస్‌లపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని, అయితే తమ పరిశోధన ప్రకారం అవి మానవులకు సోకే సామర్థ్యానికి కొంత దూరంలో ఉండవచ్చని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్  డాక్టర్ మైఖేల్ లెట్కో తెలిపారు. కోవిడ్‌-19 వెనుక ఉన్న వైరస్ అయిన సార్స్‌ కోవ్‌-2 మాదిరిగా ఈ బ్యాట్‌ వైరస్‌లు కణాలపై దాడి చేయడానికి స్పైక్ ప్రోటీన్‌లను ఉపయోగిస్తాయన్నారు. ప్రస్తుతానికి హెచ్‌కేయూ5 వైరస్‌లు గబ్బిలాలలో మాత్రమే ఏసీఈ2తో అనుసంధానమై ఉన్నాయని, అయితే అవి చిన్నపాటి జన్యు మార్పుతో మానవులలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు ఈ స్పైక్ ప్రోటీన్లు ఎలా అభివృద్ధి చెందుతాయనేది తెలుసుకునేందుకు అత్యాధునిక ఏఐ సాధనం ఆల్ఫాఫోల్డ్ 3ని ఉపయోగించారు.

ఇది కూడా చదవండి: ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహ తయారీకి అంకురార్పణ

Advertisement
 
Advertisement
Advertisement