
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులకు శుక్రవారం( జూన్ 6వ తేదీ) అంకురార్పణ జరిగింది. 71వ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. దీనిలో భాగంగా కర్రపూజతో గణేష్ విగ్రహ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ నమూనా రూపాన్ని విడుదల చేశారు ఉత్సవ సమితి సభ్యులు. ఈ ఏడాది. శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఇవ్వనున్నారు.
