నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోనులో మాట్లాడిన మోదీ | modi calls balen shah Ready To Provide Assistance | Sakshi
Sakshi News home page

నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోనులో మాట్లాడిన మోదీ

Aug 26 2026 5:50 PM | Updated on Aug 26 2026 6:30 PM

modi calls balen shah Ready To Provide Assistance

ఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. నేపాల్‌లో ఆకస్మిక వరదలపై మోదీ ఆరా తీశారు. నేపాల్‌కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

88 మందిని రక్షించిన నేపాల్ సైన్యం
నేపాల్ సైన్యం ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 88 మందిని రక్షించిందని ఆ దేశ సైన్యం ప్రతినిధి తెలిపారు. మైలుంగ్ గ్రామంలో మరో 115 మందిని రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గాలింపు, సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. తిమురే, స్యాబ్రుబేసి, బేత్రావతిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందిందని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల కారణంగా త్రిశూలీ జలవిద్యుత్ ప్రాజెక్టు దెబ్బతిందని, పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయని పేర్కొంది.

ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?

ఇప్పటివరకు ఏం జరిగింది?

  • నేపాల్ రాజధాని కాఠ్మాండుకు ఉత్తరంగా ఉన్న రసువాలో బుధవారం తెల్లవారుజామున వరదలు సంభవించాయి.

  • పోలీసుల ప్రకారం రసువాలో ఒకరు, నువాకోట్లో ఏడుగురు, ధాదింగ్లో ఆరుగురు, గోర్ఖాలో నలుగురు మృతి చెందారు.

  • దేశ పర్యాటక బోర్డు ప్రకారం 291 మంది విదేశీయులతో సహా దాదాపు 400 మంది గల్లంతైన ప్రయాణికులను గుర్తించారు.

  • చైనా అధీనంలోని టిబెట్‌లో భారీ ప్రాణనష్టం జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ కూడా నివేదించింది.

  • భూకంపం కారణంగా మంచు చరియ విరిగిపడటంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోందని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.

  • రసువాలో తీవ్ర వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారని నేపాల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.   

  • కోశీ, త్రిశూలీ, నారాయణీ నదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement