Brazil: ఐరాస కాప్‌30 సదస్సులో అగ్నిప్రమాదం | Massive Fire Breaks Out At COP30 Venue In Brazil Video Viral, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Brazil: ఐరాస కాప్‌30 సదస్సులో అగ్నిప్రమాదం

Nov 21 2025 7:58 AM | Updated on Nov 21 2025 9:16 AM

Massive Fire Breaks Out At COP30 Venue In Brazil Video Viral

బెలెం: బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలక సమావేశాలు జరిగే "బ్లూ జోన్"లో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మందిని తరలించారు. అగ్ని ప్రమాదం సందర్బంగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లో ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ వాతావరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంధానకర్తలు ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్ వద్ద మంటలు చెలరేగి భవనం గోడలు, పైకప్పును కప్పి ఉంచిన ఫాబ్రిక్ షెల్ పైకి వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో 13 మంది గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేవలం ఆరు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్‌ పరికరాలు, మైక్రోవేవ్‌ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement