వాషింగ్టన్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట బాంబు సంచలనంగా మారింది. తాజాగా ఢిల్లీ పేలుళ్ల ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికి ఉగ్రదాడే అని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించడంలో భారత్‌కు ఎవరి సాయం అవసరం లేదు.. అధికారుల పనితీరు ప్రశంసనీయం అని కొనియాడారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం కెనడాలో జరిగిన జీ-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మార్కో రుబియో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని, కానీ ఆ అవసరం భారత్‌కు లేదని వ్యాఖ్యానించారు. భారత అధికారులు అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
US Secy of state Marco Rubio on Delhi terror incident
"It is clearly a terrorist attack"
"India doing very good job carrying out investigation"
"US has offered help, but India capable of investigation" pic.twitter.com/a0Ol6uw1OJ— Sidhant Sibal (@sidhant) November 13, 2025
ఇక, కెనడాలో జరగుతున్న జీ-7 సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మార్కో రూబియోతో భేటీ అయ్యారు. ఇరువురి మంత్రులు అనేక ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు. ఢిల్లీ పేలుడు విషయం కూడా వారు చర్చించినట్లు.. రూబియోతో భేటీ గురించి జైశంకర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన విషయం తెలిసిందే.


