వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో శాంతిస్థాపనే లక్షంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఇకపై హమాస్ చేతిలో ఎటువంటి ఆయుధాలుండవని పూర్తి నిరాయుధీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.గాజా స్ట్రీట్‌లో శాంతి స్థాపన కోసం ఏర్పాటైన బోర్ట్ ఆఫ్ పీస్ సాధించిన అత్యంత కీలక విజయమని పేర్కొన్నారు.
2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రమైన భీకర యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో పాటు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో చెలరేగిన ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా అంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ గాజాలో శాంతిస్థాపన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి 'బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటు చేశారు.
కాగా ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపన కోసం ఒక కీలక ఒప్పందం జరిగినట్లు తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. "ఈ రోజు బోర్డ్ ఆఫ్ పీస్ ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గాజాలో శాంతి, భద్రతలు నెలకొనడానికి ఇది ఒక అద్భుతమైన ముందడుగు ఈ నిరాయుధీకరణ ప్రక్రియ జాగ్రత్తగా దశలవారీగా జరుగుతుంది " అని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఈ ఒప్పందంపై హమాస్ నుండి ఎలాంటి తక్షణ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, తమ ఆయుధాలను విడనాడే ప్రక్రియ దిశగా హమాస్ అడుగులు వేస్తోందని కైరోలోని మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపనను అక్కడి పోలీసులతో పాటు 'ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్' (ISF) చేపడుతుంది.
అయితే పాలస్తీనాలో ఇప్పటికీ హింస చెలరేగుతోంది. గత గురువారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. హమాస్ తన ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టాలని ఆ సంస్థను సైనికంగా నిరాయుధీకరణ చేయాలనేది ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్ ఒకవేశ ఇది కార్యరూపం దాలిస్తే త్వరలోనే ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది.


