ఒప్పందాన్ని ఇరాన్‌  ఉల్లంఘించింది: ట్రంప్‌  | Iran violated ceasefire says Usa President Donald Trump | Sakshi
Sakshi News home page

ఒప్పందాన్ని ఇరాన్‌  ఉల్లంఘించింది: ట్రంప్‌ 

Jun 27 2026 4:44 AM | Updated on Jun 27 2026 4:44 AM

Iran violated ceasefire says Usa President Donald Trump

వాషింగ్టన్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. హార్మూజ్‌ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై డ్రోన్‌ దాడి జరగడంపై ఆయన శుక్రవారం తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ఇదొక మూర్ఖపు ఉల్లంఘన అని అభివరి్ణంచారు. 

డ్రోన్‌ దాడి వల్ల ఓడ పైభాగానికి నష్టం జరిగిందని తెలిపారు. అయితే, ఆ ఓడ ముందుకు సాగగలిగిందని చెప్పారు. మరో మూడు డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. గురువారం ఒమన్‌ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగిందని బ్రిటిష్‌ సైన్యం తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement