ఎందుకిలా తారుమారు? | High temperatures in Europe | Sakshi
Sakshi News home page

ఎందుకిలా తారుమారు?

Jul 2 2026 4:40 AM | Updated on Jul 2 2026 4:40 AM

High temperatures in Europe

యూరప్‌లో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చాలా ప్రాంతాల్లో ఎండలకు రోడ్లు మెత్తపడ్డాయని..కరిగిపోయాయనే వార్తలు వస్తున్నాయి.40 డిగ్రీలకే అక్కడి రహదారుల పరిస్థితి అలా అయింది. మరి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేమన దేశంలో మాత్రం రోడ్లు ఎందుకుదృఢంగా ఉంటున్నాయి. అవి నాసిరకమైనవా? ఏంటి తేడా?

యూరప్‌
» యూరోప్‌లో రోడ్లను అత్యంత శీతల ఉష్ణోగ్రతల కోసం రూపొందిస్తారు.  
» ఫ్లెక్సిబిలిటీ కోసం మెత్తని తారును వాడతారు. దీని వల్ల గడ్డకట్టించే చలిలోనూ రోడ్లు బీటలు వారవు.  ఇదే ఫ్లెక్సిబిలిటీ తీవ్రమైన ఎండలసమయంలో ప్రతికూలంగా మారుతుంది.
»  40 డిగ్రీలు లేదా అంతకు మించి నమోదైనప్పుడు తారు మెత్తపడి.. వాహనాలబరువుకు రోడ్లు వంకరలు తిరగడం, గుంటలు పడటం లాంటివి జరుగుతాయి. 

భారత్‌
» మన రోడ్ల నిర్మాణం పూర్తిగా వేరు. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తయారుచేస్తారు. 
»   వీజీ–30, వీజీ–40 రకం గట్టి తారును కంకరతో కలిపి వాడతారు. దీని వల్ల రోడ్డు దృఢంగా ఉంటుంది. 
»  45 డిగ్రీల ఎండలోనూ రూపుమారదు. ట్రాఫిక్‌ రద్దీతోపాటు వాహనాల అధిక బరువునూ తట్టుకుంటుంది.   

అంటే.. ఇందులో నాణ్యత సమస్య లేనే లేదు. ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగారోడ్ల రూపకల్పన ఉంటుంది. మనది వేసవికాలానికి అనుగుణంగా రూపొందిస్తే.. యూరప్‌లో చలికాలానికి అనుగుణంగా రూపొందిస్తారు. అదీ సంగతి. 

-సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement