అఫ్గాన్‌లో భూకంపం..120 మంది మృతి | Earthquake in Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో భూకంపం..120 మంది మృతి

Oct 8 2023 5:07 AM | Updated on Oct 8 2023 11:14 AM

Earthquake in Afghanistan - Sakshi

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో 120 మంది చనిపోగా, 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం తాకిడికి హీరట్‌ ప్రావిన్స్‌ జెందా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోని డజన్లకొద్దీ ఇళ్లు ధ్వంసమయినట్లు అఫ్గాన్‌ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది.

అఫ్గాన్‌–ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలోని హీరట్‌ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది.   భూకంప నష్టం, మృతులకు సంబంధించి తాలిబన్‌ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement