కొత్తగా ట్రంప్‌ ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌’  | Donald Trump announces Super Intelligence Force to coordinate AI policy | Sakshi
Sakshi News home page

కొత్తగా ట్రంప్‌ ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌’ 

Oct 5 2026 6:05 AM | Updated on Oct 5 2026 6:05 AM

Donald Trump announces Super Intelligence Force to coordinate AI policy

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టే లక్ష్యంగా సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ప్రకటించారు. జాతీయ నిఘా డైరెక్టర్‌ జే క్లేటన్‌ ఈ ఫోర్స్‌కు సారథ్యం వహిస్తారన్నారు. కృత్రిమ మేధను సూపర్‌ ఇంటెలిజెన్స్‌గా పిలవాలంటూ ట్రంప్‌ కోరుతుండటం తెల్సిందే. 

సూపర్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అమెరికాను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న అమెరికా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులు, సామాజిక సంస్థలు, మత సంఘాలు, కీలక మౌలిక వనరుల కంపెనీలు, ఏఐ సంస్థలను ఈ ఫోర్స్‌ సమన్వయం చేసుకుంటుందని ట్రంప్‌ వివరించారు. 

ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ చైర్మన్‌ ఫెర్గుసన్, పెంటగాన్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మైకేల్‌ తదితరులతో కూడిన ఈ ఫోర్స్‌ ఏఐతో తలెత్తే ముప్పు, అవకాశాలపై 120 రోజుల్లోగా అధ్యక్షుడు ట్రంప్, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సుసీ వైల్స్‌కు నివేదిక అందజేయనుంది. గత వారం అమెరికాలోని అగ్రగామి టెక్‌ కంపెనీల అధినేతలు వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమై తాము అభివృద్ధి చేసే ఏఐ సంబంధిత సాంకేతికతలపై స్వయం పర్యవేక్షణ చేపడతామంటూ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌ వివరాలను ట్రూత్‌ సోషల్‌లో వెల్లడించటం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement