మనీలా: ఫిలిప్పీన్స్‌లో 9వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఓడ ప్రమాదంలో మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో, శనివారం మృతుల సంఖ్య 76కు చేరుకుంది. గల్లంతైన మరో 13 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం నుంచి 43 మంది బయటపడ్డారు. మనీలా నుంచి పలవాన్ ప్రావిన్స్‌లోని కోరాన్‌కు వస్తున్న ఎంవీ జూన్ ఆస్టర్ అనే ఈ ఓడలో ముందుగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మంటలు చెలరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో ఓడలో సిబ్బంది సహా 132 మంది ఉన్నట్లు సమాచారం. సరుకు నిల్వ ఉంచే చోట పేలుడు సంభవించినట్లు చెబుతున్న అధికారులు...అందుకు కారణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు.


