యూకే ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌  | Andy Burnham becomes UK new Prime Minister | Sakshi
Sakshi News home page

యూకే ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌ 

Jul 21 2026 4:57 AM | Updated on Jul 21 2026 4:58 AM

Andy Burnham becomes UK new Prime Minister

లండన్‌: యూకే లేబర్‌ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన ఆండీ బర్న్‌హమ్‌(56) సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఉదయం కీర్‌ స్టార్మర్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే కింగ్‌ చార్లెస్‌–3 లేబర్‌ పార్టీ నేతగా ఉన్న బర్న్‌హమ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహా్వనం పంపారు. ఆ మేరకు బర్న్‌హమ్‌ వెళ్లి బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో కింగ్‌ చార్లెస్‌ను కలుసుకున్నారు.

 అనంతరం భార్య మేరీ– ఫ్రాన్స్‌ వాన్‌ హీల్, కొందరు పార్టీ నేతలతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మొట్టమొదటి ప్రసంగంలో.. బ్రిటన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా కొత్తపుంతలు తొక్కించే సరికొత్త సాధనంగా తన ప్రభుత్వం ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలను ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేలా మారుస్తానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement