న్యూరో సర్జరీలో రోబోటిక్‌ మైక్రోస్కోప్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

న్యూరో సర్జరీలో రోబోటిక్‌ మైక్రోస్కోప్‌ ప్రారంభం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

సనత్‌నగర్‌: బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ న్యూరో సర్జరీలో అత్యాధునిక జైస్‌ కినెవో 900 రోబోబోటిక్‌ మైక్రోస్కోప్‌ను గురువారం ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఏవీ గురువారెడ్డి ప్రారంభించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక సాంకేతికతతో క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్ర చికిత్సల్లో భద్రత, ఖచ్చితత్వం, మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఇలాంటి ఆధునిక రోబోటిక్‌ మైక్రోస్కోప్‌ దేశవ్యాప్తంగా కొద్ది కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా వాస్క్యులర్‌ న్యూరో సర్జరీతోపాటు ట్యూమర్‌ ఫ్లోరసెన్స్‌ –ట్యూమర్‌ కణజాలాన్ని ఆరోగ్యకరమైన మెదడు కణజాలం నుంచి వేరు చేయడంలో సహాయపడుతుందన్నారు. సీనియర్‌ కన్సల్టెంట్‌, న్యూరో సర్జన్‌ అండ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ నవీన్‌ మెహ్రోత్రా మాట్లాడుతూ 3డీ, 4కే విజువలైజేషన్‌తో శస్త్ర చికిత్స బృందం మొత్తం ప్రక్రియను అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సీహెచ్‌ గోపాల్‌, మోహన శశాంక్‌ దివి, డాక్టర్‌ వినోద్‌కుమార్‌, డాక్టర్‌ నివేదిత సాయిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ గురువారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement