కల నెరవేరింది
భారత మహిళా క్రికెటర్ అరుంధతిరెడ్డి
శంషాబాద్: గతంలో రెండుసార్లు తుది పోరుకు చేరుకుని విఫలమైన వరల్డ్ కప్ (మహిళల క్రికెట్) చేజిక్కించుకోవడంతో భారత మహిళా క్రికెటర్లతో పాటు క్రీడాభిమానుల కలనెరవేరిందని విశ్వవిజేత జట్టులోని సభ్యురాలు అరుంధతిరెడ్డి ఆనందోత్సాహాల మధ్య తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. భారత మహిళా క్రికెట్‌లోని క్రీడాకారుల్లో ఒకరైన అరుంధతి రెడ్డి విజయోత్సవాల అనంతరం గురువారం రాత్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కుటుంబసభ్యు లు, క్రీడాకారులు, కోచ్‌లతో పాటు పలువురు క్రికెట్ అభిమానులు అరుంధతిరెడ్డికి ఘన స్వాగతం పలికా రు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ... వరల్డ్ కప్ సాధించడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. కష్టపడితే కల నెరవేరుతుందనేదానికి ఈ విజయం ఓ ఉదాహరణ వంటిదని అభివర్ణించారు. ఆమెకు స్వాగతం పలికిన వారిలో తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనిబాలాదేవి తదితరులు ఉన్నారు.
విమానాశ్రయంలో అరుంధతిరెడ్డికి స్వాగతం


