గోమాతకు ఓటేస్తే.. గోవిందుడికి వేసినట్లే..
పంజగుట్ట: ప్రతి హిందువు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గోమాతను కాపాడేందుకు బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి అన్నారు. గోమాతకు ఓటు వేస్తే గోవిందుడికి ఓటు వేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. గోమాతను కాపాడేందుకు యుగ తులసి పార్టీ తరఫున బరిలో ఉన్న కొలిశెట్టి శివకుమార్‌కు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. మన దేశంలో పులులు, నక్కలు, జింకలు, కుక్కలకు చట్టాలున్నాయని, కానీ హిందువులు పూజించే గోమాతకు చట్టం లేకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల బీఫ్ ఎగుమతికి జీఎస్‌టీ రద్దు చేశారని, బీఫ్‌కు జీఎస్‌టీ రద్దు చేశారు.. ఆవు నెయ్యికి మాత్రం జీఎస్‌టీ విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా యుగతులసి పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. సమావేశంలో పరివ్రాజక్ స్వామి దయాశంకర్, కృప శ్రీనివాస్, చంద్రస్వామి, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
స్వామి పరిపూర్ణానంద


