
లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్‌కు కన్సల్టెన్సీ
విస్తరిత ప్రాంతంలో ఆధునిక హంగులు..
కొత్తగా రీజినల్ రింగ్‌రోడ్డు వరకు నగరం పరిధిని విస్తరించినప్పటికీ అనేక ప్రాంతాలు నగరీకరణకు దూరంగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టౌన్‌షిప్పుల నిర్మాణంలో ఎల్‌ఏడీపీ కీలకం కానుంది. ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఆధునిక హంగులతో రేడియల్ రోడ్లు, టౌన్‌షిప్పులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా నగరీకరణకు దూరంగా ఉన్న గ్రామాల్లో రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను సేకరించి టౌన్‌షిప్పులను నిర్మించనున్నారు. 60 శాతం నివాస సముదాయాలు ఉంటే మిగతా 40 శాతం భూమిలో 30 శాతం రహదారులు, పార్కులు, ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, విద్యుత్ కేంద్రాలు వంటి వాటి కోసం వినియోగిస్తారు. మరో 10 శాతం భూమి హెచ్‌ఎండీఏ వద్ద ల్యాండ్‌బ్యాంక్ (భూనిధి) ఉంటుంది. ఈ ల్యాండ్ బ్యాంకును భవిష్యత్ అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న భూసేకరణ విధానంలో మార్పులు చేసి సమగ్ర భూసేకరణ విధానాన్ని (కాంప్రహెన్సివ్ ల్యాండ్ పూలింగ్ పాలసీ)ని రూపొందిస్తారు.
సాక్షి, సిటీబ్యూరో:
భవన నిర్మాణ రంగానికి సరికొత్త దిశా నిర్దేశాన్ని అందజేసేలా స్థానిక ఏరియా అభివృద్ధి ప్రణాళిక (ఎల్‌ఏడీపీ)కు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ కసరత్తు చేపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు అర్హత గల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్)ను ఆహ్వానిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఆసక్తిగల సంస్థలు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం వివిధ సంస్థల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎల్‌ఏడీపీ రూపకల్పనకు అర్హత కలిగిన ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు.
భవిష్యత్‌లో టౌన్‌షిప్పులే కీలకం..
హెచ్‌ఎండీఏ స్వయంగా అభివృద్ధి చేసే లే అవుట్‌లలో కానీ ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసే వెంచర్‌లలో కానీ ప్రతి ప్లాట్‌కు రోడ్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఎల్‌ఏడీపీ ఉంటుంది. హైదరాబాద్ మహానగర విస్తరణలో భాగంగా భవిష్యత్‌లో టౌన్‌షిప్పులే కీలకం కానున్నాయి. ఈమేరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్ ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. భూసేకరణ దశ నుంచి టౌన్‌షిప్పుల నిర్మాణం వరకు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఎల్‌ఏడీపీ ఉండనుంది. ఈ నెలాఖరు వరకు కన్సల్టెన్సీని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను వేగవంతం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మెగా మాస్టర్‌ప్లాన్–2050లో భాగంగా ఎల్‌ఏడీపీని అమలు చేస్తారు.
సెప్టెంబర్ నుంచి మ్యాపింగ్..
హెచ్‌ఎండీఏ మెగా మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ప్రతిపాదించిన కామన్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ), ఎకనామికల్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఈడీపీ), బ్లూ,గ్రీన్ ఏరియా ప్లాన్‌లు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు నాటికి ఈ మూడు ప్రణాళికలను సిద్ధం చేయ నున్నట్లు అధికారులు తెలిపారు. కామన్ మొబిలిటీ ప్లాన్‌లో భాగంగా ట్రిపుల్ ఆర్ వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సదుపాయాలను అధ్యయనం చేసి భవిష్యత్తు అవసరాల మేరకు ఏ ప్రాంతంలో ఏ విధమైన ప్రజా రవాణా సదుపాయాలు అవసరరమనే అంశంపై అధ్యయనం చేపట్టారు. అలాగే ప్రత్యేక ఆర్థికాభివృద్ధి మండలాలను ఎంపిక చేసేందుకు, పారిశ్రామిక, లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపైన ఈడీపీని సిద్ధం చేయనున్నారు.
● అలాగే ట్రిపుల్ ఆర్ వరకు నీటి వనరులు, అడవులను గుర్తించేందుకు బ్లూ,గ్రీన్ ప్రణాళికపైన దృష్టి సారించారు. 2050 వరకు హైదరాబాద్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మూడు ప్రణాళికలపైన హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. ఇందుకోసం గత సంవత్సరమే కన్సల్టెన్సీలను నియమించారు. ప్రస్తుతం ఈ మూడు ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. దీంతో ట్రిపుల్ ఆర్ వరకు మ్యాపింగ్ చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం త్వరలో ఒక కన్సల్టెన్సీని నియమించనున్నారు. ప్రస్తుతం మ్యాపింగ్ చేసేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సెప్టెంబర్ నుంచి చేపట్టి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆసక్తి వ్యక్తీకరణకు హెచ్‌ఎండీఏ బిడ్డింగ్
ప్రతి ప్లాట్‌కు మౌలిక సదుపాయాలు లభించేలా..
నిర్మాణ రంగానికి సరికొత్త నిర్దేశం

లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్‌కు కన్సల్టెన్సీ

లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్‌కు కన్సల్టెన్సీ