
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్‌నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్‌లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.
భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
