
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ రిమాండ్
కాచిగూడ: ఓ వ్యక్తిపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రౌడీషీటర్‌ను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావేద్, ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్పతో కలిసి వివరాలు వెల్లడించారు. యాకత్‌పురా, బడాబజార్‌కు చెందిన షేక్ ఖదీర్ యాకుత్‌పుర రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్ ఫారం దాటుతుండగా మాదన్నపేట, చౌని ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ అబ్దుల్ సోహైల్‌తో పాటు అతని అనుచరులు డబ్బులు, సెల్‌ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. షేక్ ఖదీర్ అందుకు నిరాకరించడంతో అబ్దుల్ సోహైల్ కత్తితో అతనిపై దాడిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కాచిగూడ రైల్వే పోలీసులు ప్రధాన నిందితుడు మహ్మద్ అబ్దుల్ సోహైల్‌ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు ముదస్సిర్, ఆయన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.