
స్నాతకోత్సాహం
జేఎన్టీయూలో అలరించిన వేడుకలు
కేపీహెచ్‌బీకాలనీ: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) 13వ స్నాతకోత్సవం మంగళవారం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. యూనివర్సిటీ చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రెక్టార్ విజయ్‌కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. గతానికి భిన్నంగా స్నాతకోత్సవ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు సంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల కేరింతలు, అభినందనలు తెలిపేందుకు వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ స్నాతకోత్సవం పండగ వాతావరణాన్ని తలపించింది.
విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
విజ్ఞానాన్ని సంపాదించడమే కాదు దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడమే నిజమైన విద్య అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విద్యార్థులు సృజనాత్మకత, నైతిక విలువలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రదానం చేశారు
ఎంతో ఆనందంగా ఉంది..
గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. 5 గోల్డ్ మెడల్స్ రావటంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది.
–నవ్యశ్రీ, ఈసీఈ విభాగం
నా కల సాకారమైంది
సివిల్ ఇంజినీరింగ్‌లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మా నాన్న ఉపాధ్యాయుడు. ఎంతోమంది విద్యార్థులకు చదువు గొప్పతనం గురించి చెబుతుంటారు. నా తల్లిదండ్రుల కృషి చాలా ఉంది.
– పి.సుప్రియ, సివిల్ ఇంజినీరింగ్

స్నాతకోత్సాహం

స్నాతకోత్సాహం

స్నాతకోత్సాహం