తెలంగాణ రాజకీయాల్లో ‘డ్రామా’ లేదు: రాంగోపాల్‌వర్మ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాజకీయాల్లో ‘డ్రామా’ లేదు: రాంగోపాల్‌వర్మ

Nov 25 2023 4:44 AM | Updated on Nov 25 2023 7:30 AM

- - Sakshi

హైదరాబాద్: ఓ వైపు తెలంగాణ ఎన్నికల రణక్షేత్రం అంతకంతకూ వేడెక్కుతూ పూటకో మలుపులు తిరుగుతోంది. అయినప్పటికీ ‘తెలంగాణ రాజకీయం పట్ల ఆసక్తి కలగడం లేదు. ఇక్కడ డ్రామా లేదు’ అని తను గతంలో అన్న మాటల్ని పునరుద్ఘాటించారు సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. యాపిల్‌ హోమ్‌ రియల్‌ నీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరుగనున్న మిక్స్‌ అండ్‌ మింగిల్‌ మెగా క్రిస్మస్‌ కార్నివాల్‌ పోస్టర్‌ని బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో శనివారం రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఈవెంట్‌ ద్వారా వచ్చిన నిధులను మిషన్‌ భద్రత పేరుతో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను సేవ చేయకున్నా చేసేవారికి మద్దతు తెలపాలనే ఉద్దేశ్యంతోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్‌కి వచ్చానన్నారు. క్రిస్మస్‌ పండుగ తనకు బాగా నచ్చుతుందని, అత్యంత సింపుల్‌గా శుభ్రంగా జరిపే పండుగ అని పేర్కొన్నారు. నిర్వాహకురాలు నీలిమ ఆర్య తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement