
చార్మినార్: ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీలోని పలు నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కూడా చెప్పకుండా పతంగ్ గుర్తుకే మీ ఓటు అంటూ.. అభ్యర్థి ఎవరైనా పతంగ్ గుర్తు ముఖ్యమని స్పష్టంగా చెబుతున్నారు.
ప్రత్యర్థులు ఒక్కటైన వేళ..
రహమత్‌నగర్ : వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే..మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే..గత ఎన్నికల్లో వారిరువురు ప్రత్యర్థులు..నేడు ఒకరికి మద్దతుగా మరొకరు ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం బోరబండ డివిజన్ రాజ్‌నగర్, వినాయకనగర్ బస్తీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కోరారు.
అమ్మా.. నీ కాళ్లు మొక్కుతా ఓటెయ్యి..
అంబర్‌పేట నియోకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కృష్ణయాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళ కాళ్లు మొక్కి ఓటు అభ్యర్థిస్తున్న దృశ్యం..




ప్రచారం నిర్వహిస్తున్న మాగంటి, విష్ణువర్ధన్ రెడ్డి

Comments
Please login to add a commentAdd a comment