బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా గుండెపోటు: వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా గుండెపోటు: వ్యక్తి మృతి

Aug 17 2023 6:22 AM | Updated on Aug 17 2023 8:03 AM

- - Sakshi

హైదరాబాద్: బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా గుండెపోటు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. రామంతాపూర్‌ ఆర్టీసీ కాలనీకి చెందిన కీసర కృష్ణారెడ్డి (46) బుధవారం ఉదయం స్థానిక ఎండోమెంట్‌ ప్లే గ్రౌండ్‌లో తోటి క్రీడాకారులతో బ్యాడ్మింటన్‌ ఆడుతున్నారు.

ఈ క్రమంలో గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తోటి క్రీడాకారులు, కాలనీ వాసులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కృష్ణారెడ్డి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 23 ఏళ్లుగా కాలనీలో అందరితో కలుపుగోలుగా ఉండే కృష్ణారెడ్డి మరణ వార్తతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement