వదినపై అందరూ చూస్తుండగానే... | - | Sakshi
Sakshi News home page

వదినపై అందరూ చూస్తుండగానే...

Aug 3 2023 3:22 AM | Updated on Aug 3 2023 7:26 AM

- - Sakshi

హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత మరిది వదినను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసి గాయపరిచిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దశరథ్‌, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..కర్ణాటక రాష్ట్రం, బీదర్‌ జిల్లా, కంటనా గ్రామానికి చెందిన చంద్రకాంత్‌, మహానంద (35) దంపతులు నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని ఓల్డ్‌ హాఫీజ్‌పేట్‌లో నివాసముంటున్నారు. చంద్రకాంత్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా భార్య మహానంద మదీనాగూడలోని ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పాఠశాల ముగించుకొని మహానంద తోటి ఆయాలతో కలిసి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో మదీనాగూడలోని మైత్రి కమాన్‌ ముందు జాతీయ రహదారిపైకి రాగానే మహానంద చెల్లెలు రేష్మా భర్త హన్మంత్‌ కత్తితో వచ్చి రోడ్డుపై అందరు చూస్తుండగానే ఆమె గొంతుకోసి పారిపోయాడు.

తీవ్ర గాయలైన మహానందను తోటి ఆయాలు, స్థానికులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. హన్మంత్‌ను స్థానికులు పట్టుకొని మియాపూర్‌ పోలీసులకు అప్పగించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి భర్త చంద్రకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement