అమానుషంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అమానుషంపై ఆగ్రహం

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

అమానుషంపై ఆగ్రహం రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు

గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనకు టీడీపీ ఎమ్మెల్యేనే కారణం దాడి జరిగిందని రెండుసార్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళ కుటుంబం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, పోలీసుల నిర్లక్ష్యం వల్లే బాధితురాలిపై దాడి చంద్రబాబు సీరియస్‌ అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు టీడీపీ పాలనలో మహిళలపై దాడులకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన ప్రదర్శన

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు

గుంటూరు ఎడ్యుకేషన్‌: చంద్రబాబు పాలనలో మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం ఉదయం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పాలనలో చోటు చేసుకున్న అమానుష సంఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్లకార్డులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ తెనాలి, తాడికొండ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్‌, వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు), రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, కొలకలూరి కోటేశ్వరావు, జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్‌రెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబ్బులు, పశ్చిమ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకాయమ్మ, జిల్లా అనుబంధం విభాగాల అధ్యక్షులు పఠాన్‌ సైదా ఖాన్‌, దానం వినోద్‌, తాడిపోయిన వేణుగోపాల్‌, సీహెచ్‌ వినోద్‌, వాసిమళ్ల విజయ్‌, దానం వినోద్‌బాబు, యేటి కోటి, చిన్నపరెడ్డి, జి.ప్రభు, అవినాష్‌, మహిళా నాయకులు ఝాన్సీ, స్వర్ణలత, శివ పార్వతి, కవిత, బూసి రాజ్యలత, యక్కలూరి మారుతి కోటి లింగారెడ్డి, బూసి రాజలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement