‘మహిళను వివస్త్రను చేయడానికి ఎమెల్యే మాధవినే కారణం’ | Ysrcp Leader Ambati Rambabu On Mla Galla Madhavi | Sakshi
Sakshi News home page

‘మహిళను వివస్త్రను చేయడానికి ఎమెల్యే మాధవినే కారణం’

Jul 21 2026 12:54 PM | Updated on Jul 21 2026 1:24 PM

Ysrcp Leader Ambati Rambabu On Mla Galla Madhavi

సాక్షి, గుంటూరు: ఎమ్మెల్యే గళ్లా మాధవిపై నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. ఆమె సెటిల్‌మెంట్‌ చేయడానికి ప్రయత్నించారు’’ అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోదరి మాధవి పరువునష్టం దావా వేస్తానని చెబుతుంది... పరువునష్టం దావా వేసుకోమని చెబుతున్నానంటూ తేల్చి చెప్పారు.

మొదట దాడి జరిగినప్పుడు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. మొదటి ఘటన, రెండో ఘటనలపై రెండు కేసులు ఎందుకు నమోదు చేయలేదు?. ఎమ్మెల్యే మాధవి ఫోన్ చేసి చెప్పడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోలేదు. గుంటూరులో మహిళను వివస్త్రను చేయడానికి కారణం ఎమ్మెల్యే మాధవినే. ఒక మహిళను‌ నడిరోడ్డుపై బట్టలిప్పదీసి టీడీపీ నేత కూర్చొబెట్టాడు.

..ఇది చాలా దారుణమైన ఘటన. వీడియోలు ఒక మహిళకు వచ్చాయి.. ఆమె అందరికీ పంపించింది. ఇప్పుడా మహిళను టార్గెట్ చేశారు... ఆమె సెల్ ఫోన్ లాక్కున్నారు. వీడియోలు బయటకు రాకపోతే కేసు నమోదు చేసేవారు కాదు. పోలీసులు మీరు చట్ట ప్రకారం వ్యవహరించకుండా ఎమ్మెల్యే చెప్పారని చేస్తే మీ మీద బండలేస్తారు. అరాచక పాలన సాగుతుంది.. పోలీసులు విఫలమయ్యారు. హోంమంత్రి విఫలమయ్యిది. ఏ దావా వేసినా ఎదుర్కోవడానికి సిద్ధం. ఎన్నికలలో మీ మీద మహిళలు పెద్ద దావా వేస్తారు?’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement