ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపీపీ (ప్రైవేట్, పబ్లిక్ పార్టరన్‌షిప్) చేయాల్సిన ఆవసరం ఏముంది. వేల కోట్లు ఆదాయాలు తీసుకోవడం తప్పితే ప్రభుత్వం ఏనాడైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పట్టించుకుందా. ఉమ్మడి జిల్లాలో 38 ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 8 మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు. మిగిలినవి ప్రైవేటు భవనాల్లో ఉంటున్నాయి. ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది.
– డి.విష్ణుమూర్తి, సీనియర్ దస్తావేజు లేఖరి


