గతంలో నాన్‌జుడిషియల్ స్టాంపులు పుష్కలంగా దొరికేవి. ఓటీపీ విధానం పెట్టి ఎవరూ కొనకుండా చేశారు. స్టాక్ హోల్డింగ్ పేరుతో ప్రైవేటు కంపెనీని తీసుకొచ్చి ఈ–స్టాంపు పేపర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా స్టేషనరీ సరఫరా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఓటు వేశాం. ప్రజలకు మేలు చేయకపోగా ఇలా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– షేక్ రషీద్, స్టాంపు వెండర్ల అసోసియేషన్ జేఏసీ కన్వీనర్


