సాక్షి ప్రతినిధి, గుంటూరు: అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని పెద్ద పెద్ద మాటలు చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసానికి నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి కనిపించడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దోచుకుతింటున్నది అధికార పార్టీ కాంట్రాక్టర్లే కావడంతో తూతూమంత్రంగా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టేశామని చెప్పి, విచారణల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ కుంభకోణంపై విచారణ చేపట్టాలంటూ ఇద్దరు చీఫ్ ఇంజినీర్లను నియమించిన ప్రభుత్వం.. నివేదికను రెండు నెలల్లో అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా విచారణ మాట అటుంచితే, కనీసం కమిటీని కూడా నియమించని పరిస్థితి నెలకొంది.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనకుండానే పాల్గొన్నట్లుగా దొంగ డాక్యుమెంట్లు పుట్టించి టెండర్లు దక్కించుకోవడంతోపాటు, పనుల్లో లెస్ కోట్ చేసి, ఆ తర్వాత దానిని ట్యాంపరింగ్ చేసి ఎక్కువ లెస్‌ను కాస్త తక్కువ లెస్‌గా మార్చుతున్నారనే పలు విషయాలను రెండు నెలల క్రితం ‘సాక్షి’లో ‘‘రూ. కోట్లలో తమ్ముళ్ల లూటీ’’ కథనం ప్రచురితమైంది. ఇలా ఇంజినీరింగ్ విభాగం డ్రాయింగ్ బ్రాంచ్‌లో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు తొమ్మిదేళ్లపాటు ఈ అవినీతి దందా కొనసాగుతూనే ఉందని వెలుగులోకి తేవడంతో అవినీతికి పాల్పడ్డ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆప్‌కాస్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. దీనిపై విచారణకు ఆదేశించడం, అధికారుల పాత్ర బయటపడితే క్రిమినల్ కేసులు సైతం పెడతామంటూ హెచ్చరికలు చేసిన ఉన్నతాధికారులు రెండు నెలలు దాటుతున్నా కనీసం కమిటీని నియమించలేదు. వీరిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
టెండర్‌లో పాల్గొనకుండా వర్కులు చేయడం, లెస్‌లలో మాయాజాలం చేయడం 2017 సంవత్సరం నుంచే జరుగుతోంది. అయితే గత ప్రభుత్వంలో అప్పటి కమిషనర్ కీర్తి చేకూరి ఈ విషయాన్ని పసిగట్టి సదరు వర్కులను నిలిపివేయడంతోపాటు వారు చేసిన వర్కులకు బిల్లులు ఆపేయడంతో మరికొంత మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. డ్రాయింగ్ బ్రాంచ్‌లో పనిచేసే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పలువురికి స్థానచలనం కల్పించారు.
స్థానచలనం చేసిన వారంతా కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి డ్రాయింగ్ బ్రాంచ్‌కు వచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు మళ్లీ రెచ్చిపోయారు. 2018లో చేసినట్లే ఇప్పుడు కూడా చేశారు. కొంత మంది కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనకుండా వర్కులు ఏ విధంగా చేస్తున్నారని ఆరా తీస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత సంవత్సరం నుంచి జరిగిన వర్కుల వివరాలు, ఏయే కాంట్రాక్టర్లు వర్కులు చేశారో వివరాలు బయటకు తీయడంతో అవినీతి అనకొండల బండారం బయటపడింది.
టెండర్‌లో పాల్గొనకుండా వర్కులు చేసుకున్న జాబితాలో బడా బడా కాంట్రాక్టర్లు (తెలుగు తమ్ముళ్లు) ఉన్నట్లు సమాచారం. మంచి వర్కులను బ్లాక్ చేసుకుని వాటిని టెండర్ దాకా రానివ్వకుండా అడ్డదారిలో దక్కించుకున్నారు. సుమారు వందకు పైగా వర్కులను అడ్డదారిలో చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా కార్పొరేషన్‌కు రూ. 10 కోట్లకు పైగా ఆర్థిక నష్టం చేకూరిందని సమాచారం. కార్పొరేషన్‌కు నష్టం చేకూర్చిన కాంట్రాక్టర్లపై ఆర్‌ఆర్ యాక్ట్ (రెవెన్యూ రికవరీ యాక్ట్) కింద డబ్బులు వసూలు చేసేందుకు ఎట్టకేలకు సిద్ధమైనట్లు తెలిసింది.
టెండర్ల విషయంలో అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లు సహకరించిన పలువురు జీఎంసీ అధికారులు 70 మందికిపైగా కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కమిషనర్ నివేదిక సుమారు రూ. 10 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు విచారణకు కమిటీ కూడా నియమించకుండా తాత్సారం వేరే పేర్లతో పనులు చేస్తూ దోచుకుతింటున్న అధికార పార్టీ కాంట్రాక్టర్లు
కమిటీ
ఎక్కడ?
టెండర్లలో జరిగిన అవినీతి వ్యవహారాన్ని బయటకు తీసేందుకు ప్రభుత్వం రెండు నెలల క్రితం ఇద్దరు చీఫ్ ఇంజినీర్లను విచారణకు ఆదేశించగా, హై లెవల్ కమిటీని నియమించి రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. మరో వారం రోజుల్లో గడువు ముగుస్తున్నప్పటికీ విచారణ మాట దేవుడెరుగు, కనీసం కమిటీని కూడా నియమించలేదంటే ఈ అవినీతి వ్యవహారాన్ని దాచిపెట్టి కాంట్రాక్టర్లను, అవినీతి అధికారులను కాపాడేందుకు అధికార పార్టీలో పెద్ద శక్తి పనిచేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం రూ. 10 కోట్లకు పైగా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌లిస్టులో పెట్టిన కాంట్రాక్టర్లు వేరే పేర్లతో మళ్లీ టెండర్లు దక్కించుకుని పనులు చేస్తూ జేబులు నింపుకొనే కుట్రకు తెరతీస్తున్నారు. కొందరు అధికారులకు ఇదంతా తెలిసినప్పటికీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తమకేమీ తెలియనట్లు మిన్నకుండిపోతున్నారు.
‘‘దోచుకుంది మనవాళ్లయితే చాలు.. అది ఎంత పెద్ద అవినీతైనా చూసీచూడనట్లు వదిలేద్దాం.. మళ్లీ వేరే పేర్లతో టెండర్లు కట్టబెట్టి జేబులు నింపుదాం.. ఎవరైనా అడిగితే విచారణల పేరుతో కాలయాపన చేద్దాం...’’ ఇదీ.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న తంతు. ప్రజాధనం రూ.కోట్లలో దోపిడీకి గురైనా.. అటు అధికారులపై గానీ, ఇటు కాంట్రాక్టర్లపైగానీ ఇప్పటివరకు చర్యల ఊసే లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ్ముళ్ల
స్వాహా...
నకిలీ పత్రాలతో ప్రణాళిక
2017 నుంచి జరుగుతున్న తంతు..
అడ్డదారిలో వంద వర్కులా?