ఢిల్లీ: ఏపీలో తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను కూటమి సర్కారు అక్రమంగా బ్లాక్ చేయడంపై కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు ఏసింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి, గురుమూర్తి, మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబురావులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఖాతాలను కూటమి సర్కారు ఉద్దేశ పూర్తకంగా పదే పదే బ్లాక్ చేస్తుందని కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్సార్‌సీపీ ఎంపీలు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం అప్రజాస్వామికం అని ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ వినతిపై అశ్విన్ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంఆమని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.


