అర్చక పురోహిత విభాగానికి నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

అర్చక పురోహిత విభాగానికి నూతన కార్యవర్గం

Published Sun, Nov 12 2023 1:48 AM | Last Updated on Sun, Nov 12 2023 1:48 AM

-

గుంటూరు ఈస్ట్‌: విశ్వ హిందూ పరిషత్‌ ఆలయ అర్చక పురోహిత విభాగం జిల్లా కార్యవర్గాన్ని నియమించారు. స్థానిక బ్రాడీపేట 1వలైనులో విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్తిపాటి మాధవ శర్మ, ఉపాధ్యక్షుడిగా వల్లూరి హనుమత్‌ సాయిశర్మ, మరో ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. శివశంకర్‌ మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులు నిబద్ధతతో ధర్మ సంస్థాపనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర సామాజిక సమరసత అధ్యక్షుడు చిరుమామిళ్ళ గోపీకృష్ణ, ఉపాధ్యక్షుడు దీవి మురళి, జిల్లా కార్యదర్శి జయ రామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన వాలీబాల్‌ పోటీలు

అరకులోయ టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కంఠబౌంషుగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్‌–14 రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో విశాఖపట్నం జట్టు, ద్వితీయస్థానంలో చిత్తూరు జట్టు, తృతీయస్థానంలో శ్రీకాకుళం జట్టు నిలిచింది. బాలికల విభాగంలో ప్రథమస్థానంలో గుంటూరు జట్టు, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జట్టు, తృతీయ స్థానంలో పశ్చిమ గోదావరి జట్టు నిలిచాయి. విజేతలకు ఇన్‌చార్జీ డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు పతకాలు, ధ్రువపత్రాలు, షీల్డులు అందజేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 26 జట్లు పాల్గొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement