డైట్‌లో అవి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు

Tips To Help You Lose Weight Naturally - Sakshi

అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. వాకింగ్, డైటింగ్, వ్యాయామం ... ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామంతో పాటు డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేట్టు చూసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.

బరువు తగ్గేందుకు కూరగాయలు చక్కగా సాయం చేస్తాయని  కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయాన్ని నియంత్రణలో ఉంచకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరాన్ని డొల్లగా మార్చేస్తాయి. రోజూ తగినంత నిద్ర, నీళ్లు, సరైన డైట్‌ వల్ల స్థూలకాయం రాకుండా ఉంటుంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top