యోగం – ధ్యానం | Yogam-dhyanam spirtual connection | Sakshi
Sakshi News home page

యోగం – ధ్యానం

May 31 2025 2:30 PM | Updated on May 31 2025 2:30 PM

Yogam-dhyanam spirtual connection

యోగాత్పరతరం పుణ్యం
యోగాత్పరతరం శివమ్‌
యోగాత్పరతరం సూక్ష్మం
యోగాత్పరతరం నహి
యోగము కన్నా శ్రేష్ఠమైన పుణ్యము మరొకటి లేదు. యోగము కన్నా అధికమగు మంగళకరమూ లేదు. యోగము కన్నా శ్రేష్ఠమగు, సూక్ష్మతరమగు జ్ఞానమూ లేదు. యోగము కన్నా ఉత్కృష్టమగు వస్తువు మరొకటి లేదు. (యథార్థ భారతి ఫిబ్రవరి 2014 సంచిక) 

చదవండి:  నటి భర్త, టైగర్‌ మ్యాన్‌ వాల్మీక్‌ థాపర్‌ ఇకలేరు.. ఎవరీ థాపర్‌?

నాస్తి ధ్యాన సమం తీర్థం
నాస్తి ధ్యాన సమం తపః
నాస్తి ధ్యాన సమో యజ్ఞం
తస్మాత్‌ ధ్యానం సమాచరేత్‌ 

ధ్యానంతో సమానమైన తీర్థం లేదు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానమైన యజ్ఞం లేదు, కాబట్టి ధ్యానాన్ని బాగా ఆచరించండి అని దీని అర్థం.  యోగం, ధ్యానం వేరు వేరు కాదు. యోగంప్రారంభ దశ, ధ్యానం తర్వాతి దశ. యోగం శరీరంతో మొదలై ధ్యానానికి బాటలు వేస్తుంది. శరీరం, మనసు, ఆత్మ అనేవి మూడు విడి విడి భాగాలు కావనీ; శరీరం స్థూలమైనదనీ, దానికంటే సూక్ష్మమైనది మనస్సనీ,అంతకంటే సూక్ష్మమై అన్నిటికీ కేంద్రమై ఆధారమైఉన్నది ఆత్మ అనీ అనుభవజ్ఞులు చెబుతారు. ఆత్మ దర్శనం కావాలన్నా, ఆత్మానుభూతి కావాలన్నా అంతర్ముఖులు కావాల్సిందే! యోగంతో... అంటే శరీరంతో ప్రారంభించి మనసుకు చేరితే తర్వాత జరగాల్సినది జరుగుతుందంటారు.  అంటే ముందు శరీరాన్ని దోష రహితంగా, రోగ రహితంగా చేసుకోవాలి. తర్వాత మనసులోని మాలిన్యా లను తీసివేయాలి. వాటికి సహకరించేవే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు. ఇవన్నీ ఆచరిస్తే సమాధి అనే స్థితి కల్గుతుంది. యోగాన్ని సక్రమంగా అభ్యాసం చేసి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుదాం. ప్రపంచ శాంతికీ పాటుబడదాం. ‘యోగీ భవ’ అన్నది శ్రీకృష్ణుని సలహా. (పుట 552– గీతామకరందము)
– రాచమడుగు శ్రీనివాసులు
ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ యోగాసనాలు

Advertisement
 
Advertisement
Advertisement